ETV Bharat / state

నీట్​లో నరసాపురం విద్యార్థి ప్రతిభ.. ఈడబ్ల్యుఎస్ విభాగంలో రెండో ర్యాంక్​

వైద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చినమామిడిపల్లికి చెందిన విద్యార్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించాడు.

neet ranker with his patents
తల్లిదండ్రులతో విద్యార్థి
author img

By

Published : Oct 18, 2020, 11:38 AM IST

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా సరసాపురం చినమామిడిపల్లికి చెందిన జొన్నల బాల శివరామకృష్ణ ప్రతిభను చాటుకున్నాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయస్థాయిలో ద్వితీయ ర్యాంకు, ఓపెన్ కేటగిరిలో 26వ ర్యాంకును సాధించాడు. 720 మార్కులకు గాను 705 మార్కులు వచ్చాయి.

తల్లిదండ్రులు ప్రోత్సాహముతోనే శివరామకృష్ణ ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. నర్సాపురం జె సికిలే పాఠశాల, విజయవాడ నారాయణ కాలేజీలో చదివారు. దిల్లీ ఎయిమ్స్​లో ఎంబీబీఎస్, తర్వాత ఎంఎస్ పూర్తి చేసి న్యూరోసర్జన్​గా స్థిరపడి ప్రజాసేవ చేయాలనేది తన లక్ష్యమని చెప్పాడు. అతన్ని కుటుంబ సభ్యులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు, తదితరులు అభినందించారు.

ఇదీ చదవండి: ఎరువుల విక్రయాల్లో లోపించిన పారదర్శకత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.