Nara Lokesh Yuvagalam Padyatra 196th day: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 196వ రోజుకు చేరింది. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం వలసపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు 2వేల 613 కిలోమీటర్ల దూరం నడిచిన లోకేశ్ …నేడు వలసపల్లిలో స్థానికులతో సమావేశమయ్యారు. అనంతరం ధర్మాజీగూడెం, మట్టంగూడెంలో స్థానికులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. సుందర్రావుపేటలో స్థానికులతో ముచ్చటించి అదే గ్రామ శివారులో విడిది కేంద్రంలో బస చేయనున్నారు.
Lokesh Yuvagalam Padayatra: లోకేశ్ యువగళం పాదయాత్ర.. కార్యకర్తల్లో కసి.. శ్రేణుల్లో సమరోత్సాహం
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఉమ్మడి కృష్ణ జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి ప.గో జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోకి యువగళం ప్రవేశించింది. వలసపూడి శివారు వద్ద లోకేశ్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. పాదయాత్రను విజయవంతం చేసిన కృష్ణా జిల్లా ప్రజలు, పార్టీ నాయకులకు లోకేశ్ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నేతలు కలసికట్టుగా పనిచేస్తూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 9రోజుల పాటు విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు, పెనమలూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో 115 కి.మీ. మేర పాదయాత్ర సాగింది. ప్రతీ నియోజకవర్గంలోనూ లోకేశ్ (Lokesh) కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మిగిలిన 10నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలి వచ్చి మద్దతు తెలిపారు. పార్టీ కేడర్ కు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటానని భుజం తట్టిన లోకేశ్ భరోసా ఇచ్చారు. బహు నాయకత్వ పోటీ ఉన్న చోట త్వరలోనే అధినేత ఇన్ఛార్జ్ లను ప్రకటిస్తారని లోకేశ్ తెలిపారు. యువనేతకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీగూడెం వద్ద చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు జిల్లాల సరిహద్దు పల్లెలు పసుపుమయమయ్యాయి. వందలాది వాహనాల్లో తరలివచ్చిన కార్యకర్తలు లోకేశ్ కు అఖండ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పుల చప్పుళ్లు, బాణాసంచా మోతలతో ధర్మాజీగూడెం పరిసరాలు దద్దరిల్లాయి. అడుగడగునా యువనేతకు హారతులు పడుతూ, దిష్టితీస్తూ మహిళలు నీరాజనాలు పట్టారు. ధర్మాజీగూడెం, మట్టంగూడెం, సుందర్రావు పేటల మీదుగా యువగళం పాదయాత్ర రాత్రి బస కేంద్రానికి చేరుకోనున్నారు. ఇప్పటి వరకూ పాదయాత్ర 75 నియోజకవర్గాల్లో 2615 కి.మీ మేర సాగింది.
యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 రోజులు 115రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్ర విజయం వెనుక పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో ఉంది. గన్నవరంలో జరిగిన సభ హైలెట్ గా నిలిచింది. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను లోకేశ్ తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. - కేశినేని చిన్ని, తెలుగుదేశం నేత
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధి జరగాలన్నా.. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు. జగన్ పరిపాలనపై జనం విసిగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఓటు వేయాలా అని ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. - నాగుల్ మీరా, తెలుగుదేశం నేత