ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన నారా లోకేశ్​ - Nara Lokesh visiting flood affected areas

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

nara lokesh visits west godavari
​పశ్చిమగోదావరి జిల్లాలో లోకేశ్​ పర్యటన
author img

By

Published : Oct 27, 2020, 9:12 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేశ్​ పర్యటించారు. బాధితులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవినీతిలో మునిగిన ముఖ్యమంత్రి నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకునే స్థితిలో లేరని అన్నారు. గతంలో సీఎం రైతు రాజ్యం తీసుకొస్తానన్నారు. ఈ రోజు రాష్ట్రంలో రైతే లేని పరిస్థితి ఏర్పడేలా ఉందన్నారు. రబీ, ఖరీఫ్​ పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటిస్తామన్న జగన్​ ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

వైకాపా పాలనలో రైతులు అడుగడుగునా మోసాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, వరదల కారణంగా పంటనష్టం, కొన్ని ప్రాంతాల్లో ఊర్లు మునిగిపోయాయి. అయినా మంత్రులు గానీ, సీఎం కానీ క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. ప్రభుత్వం రైతుల క్షేమాన్ని పట్టించుకోవట్లేదు

-తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​

వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తున్నామని లోకేశ్​ అన్నారు. పరిహారం అందించకుంటే రైతులు తరఫున తెదేపా ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి జవహర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.