ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ముత్యాలమ్మ అమ్మవారిని సుమారు 500 కిలోల కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసంలో శుక్లపక్ష దశమి రోజు అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ అని ఆలయ పూజరులు తెలిపారు. రెండు రోజులపాటు అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆలయ ముఖమండపం, గర్భగుడి మండపాన్ని కూరగాయల తోరణాలతో అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని వసతులను ఏర్పాటు చేశామని ఆలయ నిర్వాహక కమిటీ తెలిపింది. రెండు రోజులపాటు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అవే కూరగాయలతో అన్న ప్రసాదం తయారు చేసి భక్తులకు వితరణ చేస్తామని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చదవండి: భీకర వర్షాలకు ముగ్గురు మృతి- నలుగురు గల్లంతు