ETV Bharat / state

తమ్ముడిని హత్య చేసిన అన్న..ఐదుగురు నిందితుల అరెస్ట్ - పశ్చిమగోదావరి జిల్లా

ఆస్తి తగాదాల్లో తమ్ముడిని హత్య చేసిన అన్నను, హత్యకు సహకరిచిన మరో నలుగురిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు అరెస్టు
author img

By

Published : Oct 6, 2019, 11:37 PM IST

నిందితులు అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మెుండుకోడు గ్రామానికి చెందిన కడకల్లు హరిబాబును సొంత అన్న ఆస్తి తగాదాలతో గత నెల 26న హత్య చేసి పరారయ్యాడు. హరిబాబు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రూరల్ సీఐ మాట్లాడుతూ కడవకల్లు హరిబాబు.. తన అన్న కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలుండేవని తెలిపారు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని తమ్ముడైన హరిబాబు ఒక్కడే అనుభవిస్తున్నాడని వారిద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఆస్తిని తమ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో కడవకల్లు వీరస్వామి, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, జనార్ధన్, దివ్య ఆంజనేయులు సెప్టెంబర్​ 26న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిబాబును మునుగోడు శివారు వద్ద అడ్డగించి ఇనుప రాడ్లతో బలంగా కొట్టి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న హరిబాబును స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందాడని సీఐ వివరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, నిందితులను, అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్య కు ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి : భీమవరంలో వ్యక్తి దారుణ హత్య

Intro:AP_TPG_06_05_MURDERES_ARREST_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) ఆస్తి తగాదాలతో వ్యక్తిని హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Body:ఏలూరు మండలం మొండు కోడు గ్రామానికి చెందిన కడవకల్లు హరిబాబు పై తన అన్న కుటుంబ సభ్యులకు తనకి గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో ఉన్న కక్షలు మనసులో పెట్టుకుని అనేకసార్లు కష్టంగా పాల్పడ్డారు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని హరిబాబు తనకు పంచకుండా తన వద్ద ఉంచుకుని అనుభవిస్తున్నారని అతన్ని చంపి ఆస్తి తమ సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో కడవకల్లు వీరస్వామి , ఆంజనేయులు వెంకటేశ్వరరావు జనార్ధన్ , దివ్య ఆంజనేయులు లు ఐదుగురు కలిసి కుట్ర పన్నారు. దాని ప్రకారం గత నెల 26వ తేదీన బైక్ మీద వెళ్తున్న హరిబాబు ని మునుగోడు గ్రామ శివారు వద్ద అడ్డగించి ఇనుప రాడ్లతో బలంగా కొట్టి ఇ అక్కడినుంచి చి పరారయ్యారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరిబాబు గ్రామస్తులు గమనించి ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికి అతడు మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రూరల్ పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఐదు నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

Conclusion:బైట్. శ్రీనివాస రావు, రూరల్ సిఐ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.