ETV Bharat / state

పెట్రోల్ పోసి తగలబెట్టారు... దారుణంగా చంపేశారు!

పశ్చిమ గోదావరి జిల్లా దుద్దుకూరులో దారుణం జరిగింది. స్థానిక మద్యం దుకాణం వద్ద కాపాలాదురుగా పనిచేస్తున్న వ్యక్తిని.. గుర్తు తెలియని దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

murset in west godavari district
పెట్రోల్ పోసి దారుణంగా హత్య
author img

By

Published : Apr 28, 2020, 6:41 PM IST

పశ్చిమ గోదావరి జిలా దేవరపల్లి మండలంలోని మల్లిపూడికి చెందిన వెంకటేష్.. దుద్దుకూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద వాచ్​మన్​గా పని చేసేవాడు. సోమవారం రాత్రి మద్యం దుకాణం వద్ద నిద్రిస్తున్న అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్య చేశారు. వ్యక్తిగత కక్షలతో ఈ ఘటనకు పాల్పడ్డారా? లేదా మద్యం దొంగలించేందుకు వచ్చి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

మాస్కులు లేకుండా బయటకు వస్తే అంతే…

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.