పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ అనుబంధ సంఘాల కార్మికుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వేతనాలు సక్రమంగా చెల్లించాలని, నాలుగునెలలుగా పెండింగులో ఉన్న హెల్త్ అలవెన్సు వెంటనే ఇవ్వాలని కోరారు.
ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని అన్నారు. జగన్ కూడా గత సర్కారు లాగే వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి:
'ఉపముఖ్యమంత్రి కుల ధ్రువీకరణ విషయంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వండి'