పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతో పాటు నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. గతేడాది మార్చి 23న ఎన్నికలు జరపడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి.
జిల్లాలో నిడదవోలు పురపాలక సంఘంలో 28 వార్డులుండగా.. 35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33,548 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నగరంలోని 28 వార్డులకు 175 మంది వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో రెండు నామినేషన్లు చెల్లుబాటు కాలేదు.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 2న నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. మార్చి 3 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం సమయం ఇచ్చింది. ఛైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించటంతో పోటీ తీవ్రంగా ఉంది. అధికార వైకాపాలోనూ ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉండటం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇవీ చూడండి...