ETV Bharat / state

రాష్ట ప్రభుత్వ భద్రత వద్దు.. కేంద్ర బలగాలతో కావాలి: రఘురామకృష్ణరాజు - raghu ramakrishnamraju security issu news

raghurama-krishna-raju
raghurama-krishna-raju
author img

By

Published : Jul 20, 2020, 2:58 PM IST

Updated : Jul 20, 2020, 4:57 PM IST

14:53 July 20

తన భద్రత వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రిట్ పిటిషన్

తన భద్రత వ్యవహారంపై దిల్లీ హైకోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ భద్రత వద్దు.. కేంద్ర బలగాలతో భద్రత కావాలని పిటిషన్​లో కోరారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందని.. భద్రత లేకపోవడంతో వాటికి హాజరుకాలేకపోతున్నానని పేర్కొన్నారు. రేపు రాష్ట్రపతిని కలిసి..  రక్షణ కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. రాష్టంలో పరిస్థితి, రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రపతికి వివరిస్తానన్నారు. 3 రాజధానుల అంశంపై రాష్టపతికి లేఖ ఇస్తానని తెలిపారు. 

అమరావతిని ఎగ్జిక్యూటివ్  క్యాపిటల్ గా కొనసాగించాలి. మా పార్టీ మంత్రి నాపై ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ నిధులను కూడా అమ్మ ఒడి పథకానికి వినియోగిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి నా వంతుగా 3లక్షల 96 వేల రూపాయల సహాయం అందించాను. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం అందించాలి.  - ఎంపీ రఘురామకృష్ణరాజు  

Last Updated : Jul 20, 2020, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.