ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషిచేయాలని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్‌లో జల శక్తి అభియాన్ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో మొక్కలు నాటారు. నీటి సంరక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోంటోందని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సంరక్షణకు కృషి చేస్తున్నారన్నారు. చాలా గ్రామాల్లో నీటి చెరువులను డంపింగ్ యార్డ్‌గా మార్చేశారని చెరువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఇది కూడా చదవండి.