సుమారు గంటన్నర పాటు పంటు నదిలోనే ఉండిపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలల ప్రవాహానికి కొంత మేర నదిలో కొట్టుకుపోయిన పంటు వలకట్టు అడ్డుపడటంతో నది మధ్యలోనే నిలిచింది. డీజల్ అయిపోవడం వలన పంటు ఆగిపోయిందని నిర్వహకులు తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పంటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేపట్టారు. మరొక పంటు సాయంతో ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఇక్కడ తరచూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నా పంటు నిర్వహకులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు డిజిల్, లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడాన్ని ప్రయాణికులు తప్పుబట్టారు. ఇప్పటికైనా పంటు నిర్వహణలో నిబంధనలు పాటించి ప్రయాణికులు సురక్షితంగా గోదావరి దాటే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : అమెరికా కుర్రాడు... ప్రేయసి కోసం ఆంధ్రాకి వచ్చాడు!