మెప్మాలో పనిచేస్తున్న తమను విధుల నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆర్పీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పురపాలక కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తమను తొలగించడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఆర్పీలను కొనసాగించాలనివిధుల్లో.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: