ప్రముఖ పుణ్యక్షేత్రం, చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల వెంకటేశ్వరుని నిత్యాన్నదాన పథకానికి రూ.18లక్షల విరాళం సమకూరింది. కృష్టా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ యాజమాన్యం ఈ విరాళాన్ని ఆలయ ఈవో దంతులూరు పెద్దిరాజుకు మంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యంతో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి ఆలయ ఈవో ప్రత్యేకంగా అభినందించి స్వామివారి ప్రసాదాలను, నిత్యాన్నదాన పత్రాన్ని అందించారు .
ఇదీ చదవండి