పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సిటీ కేబుల్ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచార వాహనాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుందని వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి అవసరమైతేనే బయటకు రావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి: సరైన సమయంలో చికిత్స అంది ఉంటే...!