వాయుగుండం హెచ్చరికల నేపథ్యంలో సముద్రం కెరటాలతో అల్లకల్లోలంగా ఉంటుందని నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు పేర్కొన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం తీరప్రాంత గ్రామాలైన పెదమైనవానిలంక, కేపి పాలెం, పేరుపాలెం గ్రామాలలో పర్యటించారు.
ప్రభుత్వ హెచ్చరికల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిందన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందని... భయపడొద్దని ప్రసాదరాజు అన్నారు.
ఇదీ చూడండి: