తెదేపా నాయకులను లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టులకు తెరలేపిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరిజిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. సంగం డైరీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతోనే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. ముందుస్తు నోటీసు కూడా లేకుండా అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వం అక్రమాలను ఎండగట్టే తేదేపా నాయకులను అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. సంగం డైరీలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా కేవలం వేధించటానికి నరేంద్రను అరెస్టు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండీ..శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి