లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు నిరసన దీక్ష చేపట్టారు. కష్ట కాలంలో పేద, మధ్య తరగతి ప్రజలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన లాంతర్లు పట్టుకొని విద్యుత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఏడీఏకు వినతి పత్రం ఇచ్చారు. కార్యాలయం వద్ద రుబ్బురోలు, కిరోసిన్ లాంతర్, విసనకర్ర వంటి సాంప్రదాయ పనిముట్లును ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి..