పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని పట్టణాలు, పల్లెల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించారు. ద్విచక్రవాహనంపై పర్యటించి ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు. పలుచోట్ల కర్ఫ్యూ అమలు సమయంలో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేశారు.
ఇదీ చదవండి: