ETV Bharat / state

సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం - పశ్చిమగోదావరి జిల్లా వాతావరణం

పశ్చిమగోదావరి జిల్లాలో సత్యనారాయణపురంలో పడవ ప్రమాదం తప్పింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Missed boat accident in Satyanarayanapuram west godavari district
సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం
author img

By

Published : Oct 15, 2020, 7:34 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో త్రుటిలో పడవ ప్రమాదం తప్పింది. గుండేరు డ్రైన్​లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో... స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచన మేరకు మత్స్యశాఖ అధికారులు రెస్క్యూ బోటు ఏర్పాటు చేశారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా... ఇంజిన్​ మరమ్మతులకు లోనై బోటు కొట్టుకుపోయింది. అందులో ఉన్న వారు చెట్ల కొమ్మలను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో కొత్తగా 4,038 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.