ETV Bharat / state

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రులు - birth anniversary of mahatma gandhi

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత పాల్గొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

MINISTERS
MINISTERS
author img

By

Published : Oct 2, 2020, 8:01 PM IST

గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పేర్ని నాని, తానేటి వనిత పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రపురం ఐటీడీఏ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ నృత్యాలతో మంత్రులకు స్వాగతం పలికారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మంత్రులు

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధఆనం ద్వారా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లాలోని ఏడు గిరిజన మండలాల్లో 1273 మందికి పోడు భూమి పట్టాలు పంపిణీ చేశారు.

పట్టాలిచ్చిన చరిత్ర వైకాపాదే: మంత్రి నాని

గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వంగా వైకాపా ప్రజల్లో నిలిచిపోతుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జిల్లాలోని ఐదు గిరిజన మండలాల్లో 1273 మందికి పట్టాలను మంత్రులు అందజేశారు. రాష్ట్రంలో వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను తిరిగి నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు ఎవరు బాధ్యులో తెలుసుకోవాలి అన్నారు. సోషల్ మీడియాను కిరాతకంగా ఎవరు తయారు చేశారు అన్నది పరిశీలించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు నూతన అక్రిడేషన్లు మంజూరు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి

'మా పార్టీకి సిద్ధాంతాలున్నాయి.. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.