ETV Bharat / state

జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం - sri ranga natha raju

పశ్చిమగోదావరి జిల్లా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాసు, చెరుకువాడశ్రీ రంగనాథరాజు, తానేటి వనితలతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకారంలో మంత్రులు
author img

By

Published : Jun 8, 2019, 2:00 PM IST

రాష్ట్ర మంత్రి వర్గంలో పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, తానేటి వనిత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర గవర్నర్ నరసింహన్..ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఆళ్ల నాని......

ఆళ్ల కాళీ కృష్ణ అను నేను
ఏలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల నాని... వైఎస్ కుటుంబానికి అనుచరుడిగా పేరుంది. గతంలో వైఎస్‌ రాలేక పోతున్నారని పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేసుకున్న నాని ఆ తరువాత ఆయన సమక్షంలో వివాహం చేసుకుని ఆయనకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఏడేళ్ల పాటు పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించారు. ఇవన్నీ మంత్రివర్గంలో చోటుకు కలిసివచ్చాయి.అనూహ్యంగా తెరపైకి
చెరుకువాడశ్రీ రంగనాథరాజు
జిల్లాలో ఉన్న అందరి శాసనసభ్యులకంటే సీనియరు నాయకుడు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన చెరుకువాడ రంగనాథరాజు అనూహ్యంగా తెరపైకి వచ్చి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణపై పోటీ చేసివిజయం సాధించారు. అన్ని సామాజిక వర్గాలకు సమతుల్యం పాటించడంలో భాగంగా ఈయనకు అవకాశం దక్కినట్లు చెబుతున్నారు.మహిళా కోటాలో
తానేటి వనిత ప్రమాణం
కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తానేటి వనిత...2009లో గోపాలపురం నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైకాపాలో చేరిన ఆమె...2014లో జవహర్ పై పోటీ చేసి ఓటమి చెందారు. ఐదేళ్ల పాటు వైకాపా బలోపేతానికి కృషి చేస్తూ వచ్చింది. మహిల కోటాలో ఆమెకు మంత్రిగా స్థానం దక్కింది.

Amaravati (Andhra Pradesh), June 07 (ANI): Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy called on Yuvajana Sramika Raithu Congress Party (YSRCP) legislative party meeting in AP's Amaravati on Friday. The meeting was attended by all the elected party MLAs at Reddy's camp office in Tadepalli. All the 150 MLAs of the YSRCP are present in the meeting. In the Andhra Pradesh Assembly election, Reddy's YSRCP got an absolute majority by winning 151 out of 175 seats.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.