దశలవారీగా మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మద్యపాన నిషేధం లో భాగంగా 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తున్నట్లు, జీవో విడుదల చేశామని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆమె తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4300 బెల్ట్ దుకాణాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. మద్యంపై వచ్చే ఆదాయం కోసం ముఖ్యమంత్రి జగన్ ఆశ పడటం లేదని వెల్లడించారు.
ఇవీ చూడండి...