ETV Bharat / state

ఇళ్లు కట్టిస్తాం... వసతులు కల్పిస్తాం: మంత్రి చెరుకువాడ - tour

పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఆయా గ్రామాల్లోని సమస్యలపై ఆరా తీశారు.

మంత్రి శ్రీరంగనాథరాజు
author img

By

Published : Jul 21, 2019, 5:43 AM IST

అచంట నియోజకవర్గంలో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన

పశ్చిమ గోదావరి జిల్లా అచంటలో నియోజకవర్గంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం తొలిసారిగా ఆచంట, పెనుమంట్ర మండలాల్లోని ఆరు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని 52 గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, మౌలిక సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అర్హులైన పేదలందరికీ నూటికి నూరుశాతం ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. త్వరలో నియామకం కాబోయే గ్రామవాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

ఇది కూడా చదవండి

తల్లి పింఛన్​ కోసం కొడుకు వక్రబుద్ది.. ఆ తర్వాత ఏమైంది!

Intro:రాకపోకలు అంతరాయంBody:యాంకర్ వాయిస్: కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నీరు, చెట్టు పనులు చేపట్టేలా సంబంధిత జలవనరుల శాఖ అధికారులు పచ్చజెండా ఊపడంతో నిర్వహించిన పనులు వరదలకు కొట్టుకుపోయి రెండు గ్రామాల పొలాలకు వెళ్లే రహదారికి తీవ్ర అంతరాయం ఏర్పడిన సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం శంకర్ నగరం గ్రామం వద్ద చోటుచేసుకుంది.

వాయిస్ ఓవర్: అనంతసాగరం మండలంలోని శంకర్ నగరం వద్ద కొమ్మ లేరు వాగుకు బ్రిడ్జి నిర్మాణం కోసం నీరు, చెట్టు పథకం కింద గత ప్రభుత్వం సుమారు 48 లక్షలతో పనులు చేపట్టింది. ఈ పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్ రాకపోకల కోసం వాగులో ప్రత్యామ్నాయంగా డైవర్షన్ రోడ్డును అత్యంత నాసిరకంగా ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొమ్మల వాగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో ఉదయం వాగు ఉద్ధృతి తట్టుకోలేక బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. రెండు గ్రామాల పొలాలకు వెళ్లిన రైతులు ఆవలి వైపు చిక్కుకుపోయారు. సంఘటనా స్థలానికి చేరునుకున్న ఇరిగేషన్ అధికారులతో రైతులు వాగ్వి వాదానికి దిగారు. 500 ఎకరాల పొలాలు కొమ్మ లేరు ఆవలి వైపు ఉండడంతో రెండు గ్రామాలకు ప్రధాన రహదారి అయిన బ్రిడ్జి నిర్మాణంలో అలసత్వం ఏమిటని అధికారులను నిలదీశారు. డైవర్షన్ నిర్మాణం చేపట్టే సమయంలో కాంట్రాక్టర్ కు తాము ఎన్ని సార్లు మొత్తుకున్నా వినలేదని వాపోయారు. నిర్మాణం చేపట్టే సమయంలో అధికారులు పత్తా లేకుండా పోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా డైవర్షన్ పనులు చేపట్టారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోన్ నెం 9866307534
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.