పేదల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా తొలి విడతలో 15.6 లక్షల ఇళ్లను రానున్న ఉగాది నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్లో జగనన్న కాలనీల గృహ నిర్మాణాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలోని 17 వేల కాలనీల్లో ఆషాడమాసంలోపు నిర్మాణాలకు శంకుస్థాపన జరిగేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు.
క్షేత్రస్థాయిలో భూసేకరణ, పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాల్లో వేగం పెంచేందుకు ప్రతి జిల్లాకు ఒక గృహ నిర్మాణ జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్నారు. ప్రతి పంచాయతీకి ఒక మండల స్థాయి అధికారితో పాటు 20 మంది లబ్ధిదారులకు ఒక గ్రామ స్థాయి అధికారి నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీచదవండి
Sonu Sood: 'నా భార్యది గోదావరి జిల్లా.. ఏపీ, తెలంగాణలు నాకు రెండో ఇల్లు'