ETV Bharat / state

ఉద్యాన విశ్వవిద్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం - మంత్రి కన్నబాబు చేతుల మీదుగా తాడేపల్లిగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం

విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఉద్యాన పంటల యాజమాన్యం, తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం వంటి అంశాల్లో శిక్షణా కార్యక్రమాలను.. మంత్రి తానేటి వనితతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని వైఎస్​ఆర్​ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పలు శాఖలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

minister kannababu started training sessions in tadepalligudem horticulture university
తాడేపల్లిగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కన్నబాబు
author img

By

Published : Jan 19, 2021, 9:49 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట రామన్న గూడెంలోని వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో.. వివిధ పనులకు మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయంలోని ఉద్యాన నైపుణ్య కేంద్రం వద్ద .. ఎండిన పూలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఉద్యాన పంటల నర్సరీ యాజమాన్యం, శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగలు, పుట్టగొడుగుల పెంపకం, జీవ నియంత్రణ ఉత్పత్తి వంటి పలు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించారు.

విశ్వవిద్యాలయంలోని పలు శాఖలను సందర్శించి.. ఇక్కడ ఉత్పత్తి చేసే వివిధ రకాల న్యూట్రీ బిస్కెట్లు, తేనె, పుట్టగొడుగుల గురించి ప్రధాన శాస్త్రవేత్త కరుణశ్రీని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, అబ్బాయి రాజుతో పాటు విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.