పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మొత్తం 92 గృహాలు నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్లకు సంబంధించి వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధి కొద్ది రోజులకే ఖర్చు అయిపోతుందని, ఒకసారి ఇల్లు నిర్మిస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని మంత్రి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రాష్ట్రంలో రూ.50 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడమే లక్ష్యమన్నారు.
ఇదీ చూడండి: