ETV Bharat / state

'కరోనా గురించి భయమొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది'

author img

By

Published : Apr 20, 2020, 4:40 PM IST

కరోనా గురించి ప్రజలు అనవసర భయాలకు గురికావొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు.

miniser sri ranganatharaju tour at achanta west godavari district
ఆచంట పర్యటనలో మంత్రి రంగనాథరాజు

కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని గ్రామాల్లో మంత్రి పర్యటించారు. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లాక్ డౌన్​ను సక్రమంగా పాటిస్తూ అందరూ ఇళ్లల్లోనే ఉండి కొవిడ్​ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఒక క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. కరోనా గురించి ప్రజలు భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి.. రాష్ట్రంలో 722కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.