పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం పాఠశాలల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం పెట్టేందుకు జిల్లా మొత్తంగా సుమారు 6 వేల మంది పని చేస్తున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి సకాలంలో బిల్లులు అందక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. వేలకు వేలు అప్పు చేసి మధ్యాహ్న భోజన తయారీ కోసం ఖర్చు పెడుతున్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులివ్వాలి
క్షేత్రస్థాయి పరిస్థితే ఇలా ఉంటే... ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఆహార పట్టిక ఉన్న ఇబ్బందులను రెట్టింపు చేసేలా ఉందంటున్నారు మధ్యాహ్న భోజన నిర్వాహకులు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. బిల్లులు సకాలంలో వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ సరఫరా, గ్రైండర్లు, మిక్సీలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. తమకు ఇస్తామని చెప్పిన గౌరవ వేతనం సైతం సక్రమంగా చెల్లించటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకాలకు బిల్లులను వెంటనే మంజూరు చేస్తే పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టడానికి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.
ఇదీ చూడండి: