ETV Bharat / state

తుఫానుగా మారిన వాయుగుండం.. ‘మాండూస్’గా నామకరణం... - విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్

meteorological department: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫానుగా బలపడిందని ఐఎండి తెలిపింది. ఈ తుఫాన్​కు ‘మాండూస్’గా నామకరణం చేశారు. తుపాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు - ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ సూచించారు.

meteorological department
meteorological department
author img

By

Published : Dec 8, 2022, 2:15 PM IST

Meteorological Department cyclone alert in AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. తుపాను ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను నేపథ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆరు జిల్లాల్లోని కోటిమందికిపైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు జారీచేశారు. తుఫాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు. తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా పయనించునుందని ఐఎండి తెలిపింది. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండి పేర్కొంది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యలకోసం 5-ఎన్డీఆర్ఎఫ్, 4-ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటుచేశారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేద్కర్ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.