ETV Bharat / state

POLAVARAM: పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పూర్తి - Polavaram project latest information

పోలవరం ప్రాజెక్టులో మరో కీలకమైన నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ పూర్తి చేసింది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్​లో భాగంగా నిర్మించాల్సిన గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు.

Polavaram project
పోలవరం ప్రాజెక్టు
author img

By

Published : Sep 9, 2021, 3:38 PM IST

Updated : Sep 9, 2021, 4:11 PM IST

పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్​లో భాగంగా నిర్మించాల్సిన గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ అధికారులు పూర్తి చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్​ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి.. అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు

153.5 మీటర్ల పొడవున, 53.320మీటర్ల ఎత్తు అలాగే 8.5 మీటర్ల వెడల్పుతో ఈ గ్యాప్ 3 కాంక్రీట్​ డ్యామ్​ను నిర్మించారు. స్పిల్ వే నుంచి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్​కు అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ ఉపకరిస్తుంది. ఈ నిర్మాణం కోసం 23 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్​ను వినియోగించినట్టు మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ తెలిపింది. అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2 డ్యామ్​లను కూడా నిర్మించాల్సి ఉంది. ఈ రెండు డ్యామ్​లు మట్టి, రాళ్లు, సిమెంటుతో నిర్మించాల్సి ఉంది. అయితే గ్యాప్ 3 డ్యామ్ మాత్రం పూర్తి కాంక్రీట్ డ్యామ్​గా నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం నదిలో వరద నీటి ప్రవాహం కారణంగా ప్రధాన నిర్మాణాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఈసీఆర్ఎఫ్​కు అనుసంధానించే గ్యాప్ 3 నిర్మాణాన్ని ప్రాజెక్టు అధికారులు పూర్తి చేశారు.

ఇదీ చదవండీ.. రన్నింగ్​లో​ ఉండగానే ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్..

Last Updated : Sep 9, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.