పశ్చిమగోదావరి జిల్లా ఆచంట శివారు ప్రాంతం కాపులపాలెంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మానేపల్లి సుజాత అనే మహిళ ఇంట్లో విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు సుజాత భర్త, అత్తమామలపై అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా అల్లుడు కట్నం కోసం తమ కూతుర్ని వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి.. ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు మృతి