పొగాకును మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయటం ఒక చారిత్రాత్మక నిర్ణయమని సంస్థ ఎండీ ప్రద్యుమ్న అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్ఎల్ఎస్ (ఉత్తర ప్రాంత తేలిక నేలలు) ప్రాంతంలో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన, ప్రద్యుమ్న, పొగకు వేలాన్ని పరిశీలించారు.
మెుదటి సారిగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో పొగాకు కొనుగోలు చేయాలని మెట్ట ప్రాంత ఎమ్మెల్యేలు కోరిన మేరకు పరిశీలనకు వచ్చినట్లు వెల్లడించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా... ఈ ఏడాది మార్క్ఫెడ్ ద్వారా మెుక్కజొన్న, ఇతర పంటలు సైతం కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.
రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు చేసే విధంగా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ఎలీజా, తలారి వెంకట్రావు తెలిపారు.
ఇదీ చదవండి: