ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ అప్పు తీర్చేందుకు...చిన్నారి హత్య - బంగారు చెవి దుద్దెల కోసం చిన్నారి హత్య

క్రికెట్ బెట్టింగ్​లో చేసిన అప్పులు తీర్చేందుకు చిన్నారిని హత్య చేశాడో కిరాతకుడు. బాలిక చెవులకున్న బంగారం కోసం...మాయమాటలు చెప్పి చిన్నారిని గ్రామ శివారులో ఉన్న షెడ్డుకు తీసుకెళ్లి హత్య చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

క్రికెట్ బెట్టింగ్ అప్పు తీర్చేందుకు...చిన్నారి హత్య

author img

By

Published : Oct 20, 2020, 11:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం తోచలకరాయుడి పాలెం గ్రామంలో వారం రోజుల కిందట 8 ఏళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. అప్పటివరకు ఇంటివద్దే ఆడుకున్న చిన్నారి అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరికి ఒక రేకుల షెడ్డులో చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక బంధువు కాట్రు వంశీ అలియాస్ బన్ను...చిన్నారికి బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చినట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. బాలిక బంధువు వంశీ నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా... క్రికెట్ బెట్టింగ్ కోసం నగదు అవసరమై బాలిక చెవులకు ఉన్న బంగారు దిద్దులు కాజేసేందుకు.. గ్రామ శివారులోని రేకుల షెడ్డుకి తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఈ క్రమంలో దిద్దులు తీస్తుండగా బాలిక కేకలు వేయడంతో భయపడిన నిందితుడు... బాలికకు ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఊపిరి ఆడక బాలిక మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ చదవండి : కర్ణాటక మద్యం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.