పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి డ్రైనేజీలో శవమై తేలాడు. పూల రవి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లగా కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో అతని మృతదేహాన్ని స్థానికులు డ్రైనేజీలో గుర్తించారు. రవి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వర్షాలకు బయటపడ్డ కొవిడ్ బాధితుడి మృతదేహం