ETV Bharat / state

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. కాలువలో దూకిన వ్యక్తి - man died at apparao peta

పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు పేకాట శిబిరాలపై దాడి చేయగా.. వారి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి పక్కనే ఉన్న కాలువలోకి దూకి మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. కాలువలో దూకిన వ్యక్తి

author img

By

Published : Mar 16, 2021, 4:04 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. కాలువలో దూకిన వ్యక్తి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆందోళన వాతావరణం నెలకొంది. అప్పారావుపేట ఎర్రకాల్వ సమీపంలో రాత్రి పేకాట స్థావరాలపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు నుంచి తప్పించుకునే క్రమంలో కోటిపల్లి అయ్యప్ప(32) పక్కనే ఉన్న ఎర్రకాలువలో దూకేశాడు. పోలీసులు, గ్రామస్థులు గాలించినా ఫలితం లేకపోయింది.

ఒడ్డున పడి ఉన్న అయ్యప్పను ఉదయం తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆగ్రహానికి గురైన మృతుని బంధువులు మృతదేహంతో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ధర్నాకు దిగారు. ఆ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది. మృతి చెందిన వ్యక్తికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి

సెల్​ఫోన్ దుకాణంలో చోరీ..నిందితుడి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.