ETV Bharat / state

చిట్టీల పేరుతో దగా.. కోట్ల రూపాయలతో ఉడాయింపు - దొరసానిపాడులో చిట్టీల పేరుతో మోసం

గోల్డ్ స్కీం, చిట్టీల పేరుతో వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారి ప్రజల నుంచి మూడు కోట్ల రూపాయలు దోచుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో ఈ ఘటన జరిగింది.

cheating case
చిట్టీల పేరుతో మోసం
author img

By

Published : Jul 22, 2021, 10:07 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన చీమకుర్తి రాజా ద్వారకా తిరుమలలో వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గోల్డ్ స్కీం పేరుతో కస్టమర్లను ఆకర్షించాడు. 15 నెలల పాటు నెలకు 2 వేల చొప్పున 30 వేలు చెల్లిస్తే..16వ నెల బోనస్​గా మరో 2 వేలు కలిపి 32 వేలకు బంగారం కానీ వెండి వస్తువులు కానీ ఇస్తామని స్కీం మొదలుపెట్టాడు. అతను మాటలు నమ్మిన సుమారు 200 మందికి పైగా కస్టమర్లు గోల్డ్ స్కీంలో జాయిన్​ అయి నెలనెలా వాయిదాలు కడుతున్నారు. మరో రెండు మూడు నెలల్లో ఆ స్కీం గడువు ముగియనుండడంతో.. రాజా షాప్ మూసివేసి, ఇంటికి తాళాలు వేసి హఠాత్తుగా మాయమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి.

అంతే కాక స్థానికంగా చిట్టీల వ్యాపారం చేస్తూ నమ్మకంగా ఉంటూనే పాడుకున్న వారికి డబ్బు చెల్లించే వాడు కాదు. అదిగో..ఇదిగో..అంటూ కాలయాపన చేసేవాడని స్థానికులు ఆరోపించారు. వడ్డీల పేరుతో కూడా ప్రజల వద్ద నుంచి డబ్బులు కాజేశాడని బాధితులు చెబుతున్నారు. ఈ కారణంగా కొందరు బాధితులు ద్వారకా తిరుమల ఎస్ఐ టీవి సురేశ్​కు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ.. YSR kapunestham: కాపు నేస్తం నిధులు విడుదల.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.