పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో పట్టపగలు ఒంటరిగా ఉన్న మహిళపై ఓ దుండగుడు దాడి చేసి సొమ్ము అపహరించిన సంఘటన కలకలం రేపింది. మంగతాయారు శీతల పానీయాల దుకాణం నడుపుతోంది. మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి శీతల పానీయం కావాలంటూ దుకాణానికి వచ్చాడు. ఇచ్చింది చల్లగా లేదని తిరిగి ఇచ్చేశాడు. సీసా లోపల పెట్టి వెనుకనే ఉన్న ఇంట్లోకి వెళ్తుండగా ఒంటరిగా ఉన్నట్టు గమనించి.. వెనకే వెళ్లి ముసుగేసి, నోట్లో గుడ్డలు కుక్కి దాడి చేశాడు.
ఆమె స్పృహ తప్పి పడిపోవటంతో ఇల్లంతా చిందర వందర చేశాడు. చివరికి దుకాణం కౌంటర్లో ఉన్న రెండు వేల రూపాయలను ఎత్తుకెళ్లాడు.
ఇదీ చదవండి