పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీసు స్టేషన్ సమీపంలో తల్లడా-దేవరపల్లి జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొని ఒకరు మృతి చెందాగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి కరీంనగర్ జిల్లా వెలగపాడు గ్రామానికి చెందిన లారీ చోదకుడుగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నట్లు జీలుగుమిల్లి పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇది చదవండి తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదు