గోదావరికి వరద ఉద్ధృతి పెరగిన పరిస్థితుల్లో.. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని లంక గ్రామాలు మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2 రోజుల కిందట నుంచి గోదావరి శాంతిచగా.. ముంపు గ్రామాలు కాస్త తేరుకున్నట్టే కనిపించాయి. కానీ.. శుక్రవారం సాయంత్రం నుంచి మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతున్న ఫలితంగా.. గ్రామాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది.
అయోధ్యలంక , మర్రిమూల, పల్లిపాలెం ,కాపులపాలెంలో 4 అడుగుల మేర వరద నీరు చేరింది. స్థానికులు ఇళ్ల పై కప్పుకి చేరుకున్నారు. రెవెన్యూ సిబ్బంది బాధితులకు భోజన ప్యాకెట్లు అందజేశారు. సుమారు వారం రోజులుగా ముంపులోనే ఉన్న లంక వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాగునీరు, సరకులు, పాలు లభించడం గగనంగా మారింది. పశుగ్రాసం కొరతతో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి.
ఇదీ చదవండి:
కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి ఉప కమిటీలు నియమిస్తూ ఆదేశాలు