పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు లక్ష తులసి పూజ నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమం జరిపారు.
కొవిడ్ నేపథ్యంలో భక్తులెవర్నీ అనుమతించలేదు. వేద పండితులు, ఆలయ అర్చకులే పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు.
ఇదీ చదవండి:
చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రి బాగోగులు