ETV Bharat / state

karthika somavaram: కార్తీక సోమవారం.. శైవక్షేత్రాల్లో మార్మోగుతున్న శివనామస్మరణ

author img

By

Published : Nov 8, 2021, 10:58 AM IST

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. వేకువజాము నుంచి మహిళలు దీపారాధనలు నిర్వహిస్తున్నారు. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

KARTHIKA SOMAVARAM
KARTHIKA SOMAVARAM

కార్తీకమాసం తొలి సోమవారం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. నదీస్నానాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.

శ్రీశైల మహాక్షేత్రంలో తొలి కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి గంగాధర మండపం, ఉత్తర మాడ వీధుల్లో కార్తీక దీపారాధనలు నిర్వహించారు.

తూర్పుగోదావరి జిల్లా..
కార్తీకమాసం మొదటి సోమవారం, నాగుల చవితి పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం, అనపర్తి నియోజకవర్గంలో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. బిక్కవోలులోని గోలింగేశ్వరస్వామి ఆలయం, అనపర్తి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. నాగుల చవితి సందర్భంగా శివాలయాలతో పాటు సుబ్రమణ్యస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

పశ్చిమగోదావరి జిల్లా..
పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తణుకులోని సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తణుకులోని కపర్థీశ్వర స్వామి, సిద్దేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారికి జల, పాలాభిషేకాలు నిర్వహించారు. ఉండ్రాజవరంలోని గోకర్ణేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి వలంధర ఘాట్, అమరేశ్వర ఘాట్, కొండాలమ్మ ఘాట్, లక్ష్మేశ్వరం రాజు లంక ఘాట్​లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వదిలారు.

కృష్ణా జిల్లా..
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగులచవితి సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్ప అలంకరణ చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా నందిగామలో శుకశ్యామలాంబ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో పోటెత్తింది. విజయవాడలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు.. దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడుకి విశేష పూజలు చేశారు.

గుంటూరు జిల్లా..
గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వర ఆలయంలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. కృష్ణ నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి బాల చాముండీకా సమేత అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రకాశం జిల్లా..
ప్రకాశం జిల్లా ఒంగోలులోని నాగులచవితి, కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సంతపేట షిరిడీ సాయిబాబా మందిరంలోని నాగదేవత విగ్రహాలకు మహిళలు పాలు పోసి పూజలు నిర్వహించారు. చీరాల, పేరాల, ఈపురుపాలెం, వేటపాలెం, ప్రాంతాల్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చినగంజాం మండలం సోపిరాలలోని కోటేశ్వరస్వామి, కొత్తపాలెంలొని త్రికోటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

విశాఖ జిల్లా..
విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజవర్గంలో శివాలయాలు శివ నామస్మరణలతో మారు మోగాయి. వేకువ జామునుంచే భక్తులు శివాలయాల్లో పూజులు నిర్వహించారు. భీమునిపట్నం శివాలయంలో రెండు చేతులు లేకపోయినా పూజ నిర్వహించి శివయ్య అనే వ్యక్తి ప్రత్యేకంగా నిలిచాడు. రోలుగుంట మండలం బుచంపేటలోని మినీ కైలాసగిరి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయనగరం జిల్లా..
కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని విజయనగరం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు వేకువజామునే అర్చనలు, పాలాభిషేకలతో ప్రత్యేక పూజలు నిర్బహించారు.

కడప జిల్లా..
కడప జిల్లాలో శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచి శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు శివాలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

అనంతపురం జిల్లా..
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పాలాభిషేకాలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆలయ కమిటీ వారు బారికేడ్లు ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి:

చిక్కిపోతున్న సున్నా వడ్డీ పంట రుణాల పథకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.