పశ్చిమగోదావరిజిల్లాలో కార్తిక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు ఈశ్వరుని నామస్మరణతో మార్మోగాయి. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలవద్ద దర్శనం కోసం బారులుతీరారు. మహిళలు కార్తిక దీపోత్సవ పూజలు నిర్వహించారు. ఏలూరులోని పత్తేబాద శివాలయం, పాతశివాలయం, శనివారపుపేట శివాలయాల్లో ప్రత్యేక అభిషేక, అర్చనలు నిర్వహించారు. అలాగే సామూహిక అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం సోమేశ్వర జనర్ధాన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరరామలింగేశ్వరాలయాల దర్శనానికి భక్తులు వేకువ జాము నుంచే బారులుతీరారు.
ఇదీ చదవండీ...