ETV Bharat / state

'మాణిక్యాలరావు మృతి భాజపాకు తీరని లోటు' - latest news on mankyala rao death

పైడికొండల మాణిక్యాలరావు భాజపా ఆవిర్భావం నుంచి చురుగ్గా పని చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాణిక్యాలరావుకు సంతాపం తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

kanna laxmi narayana on mankyala rao death
మాణిక్యాలరావు సంతాప సభ
author img

By

Published : Aug 2, 2020, 3:18 PM IST

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు, భాజపాకు తీవ్ర నష్టమని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో మాణిక్యాలరావు సంతాప సభ జరిగింది. కన్నా లక్ష్మీనారాయణతో పాటు, మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు, శనక్కాయల అరుణ, యడ్లపాటి రఘునాథబాబు, రాష్ట్ర నాయకులు జూపూడి రంగరాజులు మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

పైడికొండల మాణిక్యాలరావు భాజపా ఆవిర్భావం నుంచి పశ్చిమ గోదావరిలో చురుగ్గా పని చేశారని, 2014లో శాసన సభ్యులుగా గెలిచి మంత్రిగా పని చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దేవాలయాలను ఎంతగానో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా సమర్ధవంతంగా పని చేసి, పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

ఇదీ చదవండి: ఏపీసీఆర్డీఏ రద్దు చేస్తూ..నాలుగు రహస్య ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.