తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలాల ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉన్న సంత నిర్మానుష్యంగా కనిపించింది. వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, కూరగాయల దుకాణాలు మూసేశారు. ప్రధాన కూడలి, పోలీస్ ఐలాండ్, బస్టాండ్ సెంటర్, సంతలో జన సంచారం లేక బోసిపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు.
ఇదీచూడండి. పశ్చిమగోదావరిలో జనతా కర్ఫ్యూకు జనం మద్దతు