పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, నేచురల్ గ్యాస్ ఇంధనాలపై విధించే పన్నును 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచి సామాన్యుడిపై భారం మోపిందని ఏలూరు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు.
ప్రక్కనే ఉన్న తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోకన్నా లీటరుకు 4 రూపాయలు ఎక్కువగా ధర ఉండటం దారుణమని చెప్పారు. కరోనా కాలంలో ప్రజలు సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
రాజధానిపై విచారణ అక్టోబర్ 5కు వాయిదా