ETV Bharat / state

'తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలి' - west godavari district latest news

పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి నుంచి తెలంగాణలోని తల్లాడ వరకు ఉన్న 516డీ జాతీయ రహదారిపై వాహన చోదకులు నరకం చూస్తున్నారని జనసేన-భాజపా నేతలు అన్నారు. జీలుగుమిల్లి నుంచి దేవరపల్లి వరకు ఈ జాతీయ రహదారిపై మరమ్మతులు చేపట్టాలంటూ పాదయాత్ర చేపట్టారు.

Tallada-Devarapalli national highway
Tallada-Devarapalli national highway
author img

By

Published : Aug 29, 2020, 7:19 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి నుంచి దేవరపల్లి వరకు జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలంటూ జనసేన-భాజపా నేతలు పాదయాత్ర చేపట్టారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి నుంచి కొయ్యలగూడెం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య తెలిపారు.

ఐదు సంవత్సరాలుగా తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారని జనసేన-భాజపా నేతలు అన్నారు. ఈ రహదారిపై గోతుల వల్ల ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రహదారులకు ప్రభుత్వం మరమ్మతులు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామని జనసేన-భాజపా నాయకులు చెప్పారు.

ఇదీ చదవండి

యువకులే లక్ష్యంగా కి'లేడీ' మోసాలు...పెళ్లి చేసుకుని ఆపై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.