పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ సభ్యులు హల్ చల్ చేశారు. రైజింగ్ రాజు, రామ్ ప్రసాద్, దొరబాబు కోడి పందాలు వీక్షించారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించాలని కోడి పందాలను చూడాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని రాంప్రసాద్ అన్నారు. సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది సాంప్రదాయ ముసుగులో కోళ్లకు కత్తులు కట్టి లక్షల్లో పందాలు కడుతున్నారని పలువురు వాపోయారు. నిన్నటి వరకు కోడి పందాలు నిర్వహిస్తుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు అటు వైపు కూడా చూడటం లేదన్నారు.
ఇవీ చదవండి: