ETV Bharat / state

'గ్రామీణ సమస్యల పరిష్కారానికి సచివాలయ సిబ్బంది కృషి చేయాలి' - itda po suryanarayana latest news

ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కారమయ్యేలా సిబ్బంది కృషి చేయాలని ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి సచివాలయ కార్యాలయంలో ఆయన తనిఖీలు నిర్వహించారు.

itda po
ఐటీడీఏ పీవో సూర్యనారాయణ
author img

By

Published : Dec 11, 2020, 7:40 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడేలా చర్యలు చేపట్టామని ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి సచివాలయాన్ని ఆయన తనిఖీలు చేశారు. ప్రజా సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించవచ్చన్నారు. సమస్య చెబితే ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

విధుల పట్ల అంకితభావం లేని వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారుల ఆదేశాలను లెక్కచేయని వేలేరుపాడు బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్​ను సస్పెండ్ చేశామన్నారు. మన్యం ప్రాంతంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించేందుకు నివేదికలు పంపించామని చెప్పారు. గిరిజనుల సమస్యలపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మరో 4 రోజుల్లో వింత వ్యాధి నిర్ధరణ: వైద్యారోగ్యశాఖ కమిషనర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.