పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సీఐటీయూ కార్యాలయంలో కొవిడ్ బారినపడిన ఉపాధ్యాయుల చికిత్స కోసం ప్రత్యేకమైన ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రారంభించారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక కోవిడ్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరగా... ఆయన అంగీకరించారని ఎమ్మెల్సీ తెలిపారు. ఏలూరు, భీమవరంలోని యూటీఎఫ్ కార్యాలయాల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేశామన్నారు. కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉంటూ ఆహార సదుపాయం లేనివారికి భోజనం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: