ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​ - interstate thieves arrest news

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోనే కాక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు.

interstate thieves
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
author img

By

Published : Nov 17, 2020, 3:56 PM IST

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ వి.రవి కుమార్ తెలిపారు. వీరి నుంచి 18.30 కాసుల బంగారం, రెండు మోటారు సైకిళ్లు, ఒక ఎమ్ఐ టీవీ, రెండు చరవాణీలు, రెండు వెండి గిన్నెలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. పోలీస్​స్టేషన్​లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ముద్దాయిలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన బండి దుర్గాప్రసాద్, తాడేపల్లిగూడెంలోని సత్యవతినగర్​కు చెందిన పైబోయిన ధన వెంకట రాము అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిద్దరూ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. రహదారులకు పక్కనే ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారని వెల్లడించారు.

ఈ ఇద్దరిపై ఇప్పటికే 40 నుంచి 50 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరు ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి తాడేపల్లిగూడెం మండలం అగ్రహారం గ్రామంలో ఉంటున్నారని చెప్పారు. దొంగతనాలు చేసేందుకు రాత్రివేళ రెక్కీ నిర్వహిస్తున్నారని సమాచారం అందిందన్నారు. రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై ప్రసాద్​ పేర్కొన్నారు.

వీరితో పాటు దెందులూరు గ్రామానికి చెందిన కొమ్మినేని రామకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతనిపై మూడు గంజాయి కేసులు నమోదయ్యాయని సీఐ వెల్లడించారు. ముద్దాయిలపై చార్జిషీట్ తయారు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

పట్టపగ్గాల్లేని నేర రాజకీయం- ఈసీ బాధ్యతేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.